- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మెగా హీరోలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటున్న ఫ్యాన్స్
బేసిక్‌గా మెగా హీరోలకు ఉండో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు నుంచే నానా హంగామా చేసేస్తారు.

దిశ, సినిమా: బేసిక్‌గా మెగా హీరోలకు ఉండో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు నుంచే నానా హంగామా చేసేస్తారు. ఇక ఇప్పటి వరకు ఉన్న మెగా హీరోలు దాదాపు అందరూ సక్సెస్ సాధించిన వాళ్లే. అయితే మెగా హీరోలు అందరూ ఒకటే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు. అలా కాకుండా ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇంకేముంది ఫ్యాన్స్‌కి పండగ అనే చెప్పాలి.
ఇదిలా సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu) సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ(aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కేపీ రోహిత్(KP Rohit) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజ్ డిఫరెంట్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అందుకోసం ధరమ్ తేజ్ బాగా కష్టపడుతున్నాడు. నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూ వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటో షేర్ చేశారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), సాయి ధరమ్ తేజ్‌తో పాటు జిమ్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఇక ఈ పిక్‌ను షేర్ చేస్తూ.. ‘మేము విశ్రాంతి తీసుకోము... కలిసి రీలోడ్ చేస్తాము’ అంటూ కండలు ఉన్న ఎమోజీని జోడించాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మీ ముగ్గురిని ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పోస్ట్‌పై ఓ లుక్ వేసేయండి.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో మనముందుకు వచ్చి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బచ్చి బాబు(Buchi Babu) డైరెక్షన్‌లో ‘ఆర్ సీ-16’(Rc-16)లో సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా వరుణ్ తేజ్ ప్రజెంట్ డిఫరెంట్ కాన్సెప్టుతో మన ముందుకు వస్తున్నాడు. రీసెంట్‌గా బర్త్ డే స్పెషల్‌గా ‘వీటీ-15’(VT-15) సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చి నెలలో నుంచి స్టార్ట్ కానున్నట్లు సమాచారం.






