thalapathy vijay: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘జన నాయగన్’ టీజర్ విడుదల అయ్యేది ఆ స్పెషల్ డే నాడే! (ట్వీట్)

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) గత ఏడాది ‘ది గోట్’(The Goat) సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

thalapathy vijay: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘జన నాయగన్’ టీజర్ విడుదల అయ్యేది ఆ స్పెషల్ డే నాడే! (ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) గత ఏడాది ‘ది గోట్’(The Goat) సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కాబోతున్నట్లు టాక్. అయితే విజయ్ తన కెరీర్‌లో చివరిసారిగా నటిస్తున్న మూవీ ‘జన నాయగన్’. హెచ్ వినోథ్(H Vinoth) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, శృతి హాసన్(Shruti Haasan), ప్రియమణిPriyamani), ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

దీనికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. ‘జన నాయగన్’(Jana Nayagan) నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఏదో ఒక అప్డేట్ రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘జన నాయగన్’ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా టీజర్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న రాబోతున్నట్లు టాక్. కాగా, ‘జన నాయగన్’ మూవీ వచ్చే ఏడాది పొంగల్ కానుకగా థియేటర్స్‌లోకి రానుంది.

Next Story