ఆస్పత్రి బెడ్‌పై దర్శనమిచ్చిన అలనాటి హీరోయిన్.. ఏకంగా 13 కుట్లు పడడంతో ఆందోళనలో ఫ్యాన్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-15 13:42:45  IST  )

సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన ‘మైనే ప్యార్ కియా’(Maine Pyar Kiya) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ(Bhagyasri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆస్పత్రి బెడ్‌పై దర్శనమిచ్చిన అలనాటి హీరోయిన్.. ఏకంగా 13 కుట్లు పడడంతో ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన ‘మైనే ప్యార్ కియా’(Maine Pyar Kiya) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ(Bhagyasri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఆమె నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు(film Fare Award) కూడా వరించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు బెంగాలీ(Bengali), కన్నడ(Kannada), భోజ్‌పురి(Bhojpuri), మరాఠీ(Marati) వంటి భాషల్లోనూ మెరిసింది ఈ అందాల తార.

ఇక చివరిగా ‘లైఫ్‌ హిల్‌ గయూ’ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ అయినటువంటి హిమాలయ్‌ దస్సానిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ పూర్తిగా సినిమాలకు దూరమైంది.

ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘రాధేశ్యామ్’(Radheshyam) సినిమాతో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు సడెన్‌గా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది.

ఆమె నుదిటిపై తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స చేసి భాగ్యశ్రీ నుదిటిపై 13 కుట్లు కూడా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా దీనిపై నటి ఇంకా స్పందించలేదు. ఇక వాటిని చూసిన నెటిజన్లు, అభిమానులు భాగ్యశ్రీకి ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరి గాయాలకు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Next Story