Tollywood: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-04 15:30:52  IST  )

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నానికి(Suicide Attempt) పాల్పడ్డారు.

Tollywood: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నానికి(Suicide Attempt) పాల్పడ్డారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిజాంపేట్‌లో భర్తతో కలిసి నివాసం ఉంటున్న ఆమె.. రెండ్రోజులుగా డోర్ ఓపెన్ చేయకుండా గదిలోనే ఉండిపోయారు. ఎంత కొట్టినా ఓపెన్ చేయకపోవడంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే కల్పిన ఇంటికి చేరుకున్న పోలీసులు డోర్ బద్దలు కొట్టి ఓపెన్ చేశారు.

అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్‌ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కల్పన తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో అనేక పాటలు పాడారు. ఇటీవల పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపైనా మాట్లాడారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారంటూ మద్దతిచ్చారు.




Next Story