Deepika Padukone : ఆ క్షణాలు ఎంతో బాధించాయంటూ దీపికా పదుకొనె ఎమోషనల్ పోస్ట్..! అసలేం జరిగిందంటే..

by Javid Pasha |   (  Updated:2025-05-08 07:14:20  IST  )

Deepika Padukone : ఆ క్షణాలు ఎంతో బాధించాయంటూ దీపికా పదుకొనె ఎమోషనల్ పోస్ట్..! అసలేం జరిగిందంటే..

Deepika Padukone : ఆ క్షణాలు ఎంతో బాధించాయంటూ దీపికా పదుకొనె ఎమోషనల్ పోస్ట్..! అసలేం జరిగిందంటే..
X

దిశ, సినిమా : ‘‘ఆ క్షణాలు నా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. అలాగే కొన్నిసార్లు నన్నెంతో బాధించాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) తన భావద్వేగ క్షణాలను(Moments of emotion) పంచుకుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా(social media)లో ఈ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తాను గర్భవతి(pregnant)గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను వివరిస్తూ ఎమోషనల్ అయింది.

‘మాతృత్వపు ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను(I faced many challenges). నెలలు నిండేకొద్దీ ఎంతో కష్టంగా అనిపించేది. ముఖ్యంగా 8, 9 నెలల్లో చాలా ఇబ్బంది పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చిన దీపిక తన కుటుంబం, స్నేహితులు ఎప్పుడూ తనకు సపోర్టుగా ఉండటంవల్ల వాటిని అధిగమించానని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నది. ‘ఆ తర్వాత అంతా మంచే జరిగింది. నా బిడ్డకు ఏం పేరు పెట్టాలోనని చాలా ఆలోచించాను. ఫైనల్లీ ‘దువా’ అని డిసైడ్ అయ్యా. ఈ పేరుకు అర్థం ‘ప్రార్థన’’ అని చెప్పిన దీపికా(Bollywood beauty) ఇప్పుడైతే తన బిడ్డతో టైమ్ స్పెండ్ చేస్తూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని, ఇకముందు షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నానని చెప్పుకొచ్చింది. చివరి సారిగా ‘సింగం అగైన్(Singham Again)లో కనిపించిన దీపిక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి కొత్త సినిమాలేవీ చేయడం లేదు.

Next Story