- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నటి పరార్
ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో మలయాళీ ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో మలయాళీ ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కొచ్చిలో ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో గొడవ పడి, అతన్ని కొట్టి కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయింది. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ కాగా.. మరొకరు పరారీలో ఉన్నట్టు కొచ్చి పోలీసులు తెలిపారు. అయితే ఆ పరారీలో ఉన్న వ్యక్తి నటి లక్ష్మి మీనన్ గా గుర్తించామని, ఆమె కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.
అయితే ఇటీవల కొచ్చిలోని ఓ పబ్ వద్ద లక్ష్మి మీనన్ ఆమె స్నేహితులు ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో గొడవ పడ్డారు. గొడవ అనంతరం అతన్ని కారులో వెంబడించి.. కిడ్నాప్ చేసి, తీవ్రంగా కొట్టారని.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆమె స్నేహితులను ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. ప్రస్తుతం నటి పరారీలో ఉన్నారు. కాగా గజరాజు, చంద్రముఖి 2, శబ్దం, ఇంద్రుడు వంటి సినిమాలతో లక్ష్మి మీనన్ పాపులారిటీ సంపాదించుకుంది.






