CHIRANJEEVI: చిరంజీవి సినిమాకు 140 టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబం

by Ajay Maddhiboyina |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

CHIRANJEEVI: చిరంజీవి సినిమాకు 140 టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబం
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా కుటుంబాలే ఈ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ కుటుంబం ఏకంగా 140 టికెట్లు బుక్ చేసుకుని సినిమాకు వెళ్లింది.

140మందిలో కొంతమంది ట్రాక్టర్ లో వెళ్లగా మరికొందరు కార్లు, ఇన్నోవాలలో వెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో చిరు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటించింది. విక్టరీ వెంకటేష్ సైతం ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.

Next Story