అవకాశాలు రావాలంటే ఇలాగే ఉండాలా అని చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-16 11:14:16  IST  )

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా.. ‘అంతకు ముందు.. ఆ తరువాత’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.

అవకాశాలు రావాలంటే ఇలాగే ఉండాలా అని చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా.. ‘అంతకు ముందు.. ఆ తరువాత’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళం, మలయాళంలో కూడా ఆఫర్స్ అందుకుని అక్కడ కూడా మెరిసింది. ఇక 2023లో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామా మశ్చీంద్ర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషా.. ఇప్పటి వరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు. ఇక సినిమాల పరంగా ఎలా ఉన్నా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ట్రెండీ ఫొటో షూట్‌లతో నెట్టింట అభిమానులను పలకరిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్లొన్న ఈ హీరోయిన్ సినీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తను ఎదుర్కొన్న పలు విమర్శల గురించి చెప్పుకొచ్చింది.

‘ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నువ్వు చాలా బ్లాక్ ఉన్నావంటూ హేళన చేసేవాళ్లు. నా ఫస్ట్ సినిమా అయిన తర్వాత కూడా.. ఏదైనా ఫొటో షూట్, ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు వాళ్లు నా వీడియోలు, ఫొటోలు జూమ్ చేసి ఎంత నల్లగా ఉన్నారు చూడండి అనేవారు. నేను చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఎలా అనిపించేది అంటే.. నేను యాక్టర్ అవ్వాలంటే తెల్లగా ఉండాలేమో అనే ఒక ఆలోచన వచ్చేది. కానీ పుట్టుకతో ఇలాగే ఉన్నప్పుడు ఇప్పుడు తెల్లగా అయితే కాలేను కదా. దీంతో ఎవరైనా కలవాలి అన్నా, మోడలింగ్ చేయాలి అన్నా నన్ను తెల్లగా చేసేవాళ్లు. ఫేస్ దగ్గర నుంచి మెడ వరకు మేకప్‌తో తెల్లగా చేసేవాళ్లు.. చేతులు, బాడీ మాత్రం నా నేచులర్ కలర్ ఉండేది. నా ఫేస్ మొత్తం పెయింట్ కొట్టినట్లు ఉండేది.. ఎందుకంటే క్లైంట్‌కు తెల్లగా కనిపించాలి. ఇలా నా కలర్‌తో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నాకు అంత తెలియకపోయేది.. ఎవరి షేడ్స్ వాళ్లకు ఉంటాయి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story