సంబరాల ఏటిగట్టు నుంచి అదిరిపోయే అప్డేట్.. అంతమంది డ్యాన్సర్లతో సాంగ్

by I. Sairam |

మెగా మేనళ్లుడు సాయి దుర్గాతేజ్(Sai Durga Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. చివరిగా ‘విరూపాక్ష’(Virupaksha) మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబరాల ఏటిగట్టు నుంచి అదిరిపోయే అప్డేట్.. అంతమంది డ్యాన్సర్లతో సాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా మేనళ్లుడు సాయి దుర్గాతేజ్(Sai Durga Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. చివరిగా ‘విరూపాక్ష’(Virupaksha) మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu) అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనికి కేపీ రోహిత్(KP Rohit) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్స్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి(Nirajan Reddy), చైతన్య రెడ్డి(Chaitanya Reddy)లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో జగపతి బాబు(Jagapathi Babu), సాయి కుమార్(Sai Kumar), శ్రీకాంత్(Srikanth), అనన్య నాగళ్ల(Ananya Nagalla) తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. దానికోసం ఈ హీరో జిమ్‌లో తెగ కష్టపడిపోతున్నాడు. ఇక రూ.125కోట్ల బడ్జేట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబరాల ఏటిగట్టు సినిమాలోని ఓ పాట కోసం దినేష్(Dinesh) నృత్య దర్శకత్వంలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ పాటను తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందట. కాగా బి. అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story