ఆకట్టుకుంటోన్న ‘ఎగ్జామ్’ ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2026-05-01 01:24:05  IST  )

పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై తెరకెక్కుతోన్న బెస్ట్ సిరీస్ ‘EXAM’.

ఆకట్టుకుంటోన్న ‘ఎగ్జామ్’ ట్రైలర్
X

దిశ, సినిమా: పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై తెరకెక్కుతోన్న బెస్ట్ సిరీస్ ‘EXAM’. ‘THE SYSTEM EXPOSED’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సిరీస్‌లో ‘ప్రేమదేశం’ సినిమాతో హీరోగాఅప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దుశారా విజయన్, అదితీ బాలన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎగ్జామ్’ సిరీస్ మే 15న అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నది. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ట్రైలర్ రిలీజ్ చేసింది. ‘మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్.. మరి ఎగ్జామ్‌ని డిసైడ్ చేసేది ఎవరు?’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ ప్రజెంట్ వైరల్ అవుతూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.

Next Story