- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం.. రంగంలోకి ఆ స్టార్ డైరెక్టర్!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం.. నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం.. నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చిన ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఆయన మొదటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతోంది? ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడు? ఎలాంటి కంటెంట్‌తో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడు? లాంటి ఎన్నో ప్రశ్నలతో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూకు సంబంధించి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతున్నది.
అందుతున్న సమాచారం మేరకు.. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ మేరకు కథ ఎంపిక నుంచి స్క్రీన్‌ప్లే వరకు ప్రతి అంశాన్ని బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే వార్త వినిపిస్తుంది. ఈ మేరకు బాలకృష్ణ సిద్ధం చేసిన కథను సందీప్ రెడ్డి వంగా తనదైన బోల్డ్ స్టైల్‌కు తగ్గట్టుగా మార్చుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






