- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రైమ్ థ్రిల్లర్ ‘రైడ్ 3’కి సర్వం సిద్ధం..
సినీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసే చిత్రాలలో రైడ్ 3 ఒకటి.

దిశ, సినిమా: సినీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసే చిత్రాలలో రైడ్ 3 ఒకటి. స్టార్ హీరో అజయ్ దేవగన్, డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా కాంబినేషన్‌లో 2018లో వచ్చిన రైడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. రైడ్ 2 కూడా తెరకెక్కించగా.. ఈ ఏడాది వచ్చిన ఈ మూవీ కూడా భారీ విజయం అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో భాగంపై కూడా అప్డేట్ వచ్చేసింది. అభిమానులు ఆశించినట్లుగానే ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న ‘రైడ్ 3’ స్క్రిప్ట్ సిద్ధం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ పార్ట్‌లో కూడా పెద్దగా చేంజస్ లేకుండా అజయ్ దేవగణ్, రాజ్‌కుమార్ గుప్తా కాంబినేషన్ కొనసాగుతుంది. రాజ్‌కుమార్ గుప్తా ఈసారి మరింత బలమైన కథ, ఇంటెన్స్ నరేషన్‌తో సిద్ధమవుతుండగా.. అజయ్ దేవగణ్ మరోసారి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. కాగా.. రైడ్ చిత్రంలో ఇలియానా, రైడ్ 2లో వాణీ కపూర్ కనిపించగా.. మూడో భాగంలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ పెరిగింది. అలాగే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.






