- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Puri Jagannath: ఆయనలో ఉన్న ప్రతి విషయం నాలో స్ఫూర్తిని నింపాయి.. చర్చనీయాంశంగా మారిన పూరి జగన్నాథ్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) ఓ వైపు వరుస సినిమాలు తెరకెక్కిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) ఓ వైపు వరుస సినిమాలు తెరకెక్కిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, పూరి జగన్నాథ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad)ను కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో అది కాస్త చర్చకు దారితీస్తోంది. ‘‘కొన్ని క్షణాలు మన హృదయంలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి విలువైన సమయాన్ని గడిపాను. ఆయన వినయం, జ్ఞానం ప్రతీ విషయంలోనూ ఆయనకు ఉన్న క్లారిటీ అన్నీ నాలో స్ఫూర్తిని నింపాయి’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆయనతో, చార్మీతో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.
కాగా, ప్రస్తుతం పూరి జగన్నాథ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో స్టార్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా నటిస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆమె ఇందులో నటించడం లేదని క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది. ఇక విజయ్ సేతుపతి మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల జూన్‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ సమయంలో.. పూరి జగన్నాథ్, విజయేంద్ర ప్రసాద్‌ను కలవడంతో ఈ విషయం కాస్త చర్చనీయాశంగా మారింది.






