- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ గురించి అందరి నోటా ఒకే మాట.. రామ్ చరణ్ నిజంగానే ఆ ఘనత సాధించగలడా?
'పెద్ది' చిత్రానికి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌లో చాలామంది ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరిని అడిగినా ఒకే మాట చెబుతున్నారు. అదేంటంటే.. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని, ఈ చిత్రంలోని ఆయన పెర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా కోసం పనిచేసిన పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో కూడా రామ్ చరణ్ ఎక్కడా చిన్న వంక పెట్టలేని స్థాయిలో నటన కనబరిచారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన క్రికెటర్‌గా, కుస్తీ వీరుడిగా, రన్నర్‌గా కనిపించనున్నారు. ఈ మూడు పాత్రల్లోనూ వేరియేషన్స్‌ను చరణ్ అద్భుతంగా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో స్పష్టంగా అర్థమవుతోంది. మరి మూవీ యూనిట్ చెబుతున్నట్లుగా ఈ చిత్రంలో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించి నేషనల్ అవార్డు అందుకుంటే, అది ఆయనకే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు కూడా గర్వకారణంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






