అందరూ పుట్టిన బిడ్డను చూడటానికే వస్తారు.. డెలివరీ వీడియో షేర్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన అనుపమ

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

అందరూ పుట్టిన బిడ్డను చూడటానికే వస్తారు.. డెలివరీ వీడియో షేర్ చేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టిన అనుపమ
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో శర్వానంద్(Sharwanand) హీరోగా నటించిన ‘శతమానం భవతి’ మూవీలో నిత్యగా చేసి సాంప్రదాయ లుక్స్‌లో కనిపించి అందరి మనసులు గెలుచుకుంది. ఇక ఈ చిత్రం సాలిడ్ హిట్ కావడంతో అనుపమకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా తెలుగులో నాగచైతన్య(Naga Chaitanya), నితిన్, రామ్ పోతినేని, సాయి ధరమ్, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ వంటి వారితో నటించింది.

ఇక నిఖిల్‌తో చేసిన కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. అయితే ఇటీవల అనుపమ ‘డ్రాగన్’సినిమాతో వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. అలాగే ఈ సినిమా అన్ని భాషల్లో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అనుపమ ‘పరదా’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఇందులో సంగీత, దర్శన రాజేంద్రన్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుపమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డెలివరీ వీడియోను షేర్ చేసింది. ‘‘అందరూ బిడ్డను చూడటానికి వస్తారు.. కానీ తల్లి మాత్రం మనల్ని చూడటానికి వస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం అనుపమ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అసలు ఆమె అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టిందా అని అంతా ఆలోచనలో పడ్డారు.

Next Story