ఎవ్రీ వారియర్‌కి ఓ రిథమ్ ఉంటుంది.. త్రిబాణధారి బార్బరిక్ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-02 08:54:34  IST  )

టాలీవుడ్ డైరెక్టర్‌ మారుతి (Maruthi) కాంపౌండ్‌ నుంచి వస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik)‌.

ఎవ్రీ వారియర్‌కి ఓ రిథమ్ ఉంటుంది.. త్రిబాణధారి బార్బరిక్ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్‌ మారుతి (Maruthi) కాంపౌండ్‌ నుంచి వస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik)‌. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సత్యరాజ్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. వశిష్ట ఎన్ సింహ, సంచి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన సాంగ్స్, గ్లింప్స్ మూవీ పై భారీ హైప్ పెంచాయి. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా త్రిబాణధారి బార్బరిక్ నుంచి థీమ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ లిరిక్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్‌ కథ ఆధారంగా ఈ సినిమా వస్తుంది.

Next Story