- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసిన ప్రతి సారి గుర్తుకు వచ్చేది నువ్వే.. నోట్ విడుదల చేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో అభిమానులు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో తారక్ కీలక పాత్రలో నటిస్తున్న ‘వార్-2’(War-2) నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్‌కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి.
ఇక నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, తారక్ ట్విట్టర్ ద్వారా ఓ కీలక నోట్ విడుదల చేశాడు. ‘‘కొన్నిసార్లు నేను ఆగి.. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూస్తాను. ప్రతిసారీ ముందుకుగా గుర్తుకు వచ్చేది నువ్వే. మీ నిరంతర ఉనికికి, హృదయపూర్వక శుభాకాంక్షలకు నా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు. వార్-2 టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 14న మీరు దానిని అనుభవించేదాక నేను వేచి ఉండలేను. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా శ్రేయోభిలాషులు, మీడియా, పరిశ్రమలోని సహోద్యోగులందరికీ స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను’’ అని రాసుకొచ్చాడు.






