- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sara Ali Khan: ప్రతి సంకేతం ఒక కథ చెబుతుంది.. కొత్త సినిమా నుంచి అప్డేట్ రాబోతుందంటూ సారా అలీఖాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్(Sara Ali Khan) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్(Sara Ali Khan) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘కేదర్‌నాథ్’(Kedarnath) చిత్రంతో వచ్చిన ఆమె అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. చేసింది తక్కువ మూవీస్ అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక గత ఏడాది ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ (Sky Force)కీలక పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. ప్రస్తుతం సారా అలీఖాన్ ‘మెట్రో.. ఇన్ డినో’(Metro.. in Dino) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని T-సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో ఆదిత్య కపూర్(aditya roy Kapoor) హీరోగా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, నీనా గుప్తా(Neena Gupta), ఫాతిమా సనా షేక్, పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), సరస్వతి చటర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, సారా అలీఖాన్ ‘మెట్రో.. ఇన్ డినో’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ప్రతి సంకేతం ఒక కథ చెబుతోంది. ఈ స్టోరీ సాంగ్‌తో ప్రారంభం కానుంది. ఈ చిత్రం నుంచి సాంగ్ టీజర్ మే 24న రాబోతుందని తెలిపింది. అలాగే ఈ మూవీ జూలై 4న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇందులో ఒక రెడ్ హార్ట్, బాణం గుర్తు, బ్యూ హార్ట్ బ్రేకింగ్ సింబల్స్‌ను షేర్ చేసింది.






