- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకిపూర్‌లోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది.. ఇది నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి: సందీప్ కిషన్
సూపర్ సుబ్బు సాధారణంగా ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన.. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వినోదాత్మక కథలో టీచర్ పాత్రలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నారు. ఎలాంటి ఉపాధ్యాయుడూ వెళ్లాలని అనుకోని మాకిపూర్‌కు అతడికి పోస్టింగ్ వస్తుంది. అక్కడ గ్రామస్తులతో ఏర్పడే అపార్థాలు, హాస్యభరిత పరిస్థితులు కథను ఆసక్తికరంగా చూపించారు. ఇక ట్రైలర్ లాంచ్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సూపర్ సుబ్బు సాధారణంగా ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం.
సుబ్బు ఒక సమస్యను పరిష్కరించాలనుకుని చివరికి మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఉద్యోగ సమస్యలు, ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, గ్రామస్తులతో వచ్చే అపార్థాలు కథను మరింత వినోదాత్మకంగా మారుస్తాయి. మాకిపూర్‌లోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌లో భాగం కావడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి” అన్నారు. హీరోయిన్ మిథిలా పాల్కర్ మాట్లాడుతూ.. హాస్యంతో పాటు మానవ సంబంధాలు, అంగీకారం, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో అందంగా చెప్పిన కథ ఇది. మల్లిక్ రామ్ క్రియేట్ చేసిన మాకిపూర్ ప్రపంచం జీవంతో నిండిపోయి ఉంటుంది. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి అనుభూతిని అందించే ఈ సిరీస్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌తో నా అనుబంధం ‘లిటిల్ థింగ్స్’ నుంచి ప్రారంభమై, ఇప్పుడు వారి తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’ వరకు రావడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది” అని చెప్పుకొచ్చారు.






