ఈ విషయంలో సిగ్గుపడుతున్నా.. వారికి క్షమాపణలు చెప్తూ నటి భావోద్వేగ పోస్ట్.. నెట్టింట ప్రశంసలు

by Mallepaka Hamsa |

ఏప్రిల్ 22న మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో సిగ్గుపడుతున్నా.. వారికి క్షమాపణలు చెప్తూ నటి భావోద్వేగ పోస్ట్.. నెట్టింట ప్రశంసలు
X

దిశ, సినిమా: ఏప్రిల్ 22న మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ సంఘట యావత్ భారతదేశాన్ని కలచివేస్తోంది. గత రెండు రోజుల నుంచి ఈ విషయం గురించే నెటిజన్లు పలు పోస్టులు షేర్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా, పహల్గాం విషాద సంఘటన గురించి నటి హీనాఖాన్(Hina Khan) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘‘ముందుగా ఈ దాడిలో మరణించిన వారికి నా సంతాపం తెలుపుతున్నాను.

అది ఓ చీకటి రోజు అనుకుంటున్నా. మానవత్వం కూడా లేకుండా ఈ దాడికి పాల్పడటం బాధాకరం. ఎదుటి వారిపై కరుణ చూపకుండా కాల్పులు జరపడం భయంకరంగా అనిపించింది. దీనిని నేను ఖండిస్తున్నాను. నేను ముస్లిం అయినందుకు సిగ్గు పడుతున్నాను. భారతదేశంలో ఉన్న హిందువులందరికీ క్షమాపణలు చెప్తున్నాను. కాశ్మీర్‌లో గతంతో పోలీస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇది భారత్‌కు క్లిష్ట సమయం. అందరం మన దేశానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. రాజకీయాలు లేవు..విభాగాలు లేవు.. ద్వేషం లేదు. ఏం చేసినా భారతీయులం అని తెలుసుకుని కలిసికట్టుగా చేద్దాం జై హింద్’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు హీనా ఖాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతావంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story