మిస్ అయినా ఆరా ఆఫ్ ఉస్తాద్

by Pulgam srinivas |

ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలైంది. అందులో ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే పాట లేదు.

మిస్ అయినా ఆరా ఆఫ్ ఉస్తాద్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఈరోజు థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం నుండి ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే పాటను విడుదల చేశారు. దానికి జనాల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు ఈ వీడియో సాంగ్ను వెండితెరపై చూస్తామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు.

ఈ చిత్ర విడుదలకు కొన్ని రోజుల ముందు నుండి ఈ సినిమాలో ఆ పాట ఉండదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంతో 'హరీష్ శంకర్'ను ఓ సందర్భంలో ఈ చిత్రంలో ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట ఉండదని అంటున్నారు? నిజమేనా అని ప్రశ్నించారు. దానికి ఆయన ఈ చిత్రంలో ఆ పాట ఉంటుందని అన్నారు. ఈరోజు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఆ పాట లేదు, కానీ అలాంటి పాటే మరొకటి ఉంది.

దాన్ని కూడా సినిమా పూర్తయ్యాక ఎండ్ టైటిల్స్ పడే సమయంలో వేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా... మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. తమిళ నటుడు పార్థిబన్ విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో రావు రమేష్ కీలకమైన పాత్రలో కనిపించాడు.

Next Story