ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా మానసిక వ్యభిచారులే.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత(Madhavilatha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు షేర్ చేస్తోంది.

ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా మానసిక వ్యభిచారులే.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత(Madhavilatha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, అమ్మాయిలపై విమర్శలు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒక అమ్మాయి పద్ధతిగా డ్రెస్ వేసుకుంటే అందగత్తె అంటారు. అలాగే మోడ్రన్‌గా రెడీ అయితే మాత్రం చెడిపోయింది దరిద్రపు ముండ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. మీరందరూ అలాంటి వారు కాబట్టి అలా అంటున్నారు. బరితెగించారు అందుకే దారుణంగా మాట్లాడుతున్నారు. మగాళ్లే ఇలా ప్రవర్తిస్తున్నారు. మీ దృష్టి లోపం వల్ల అలా కనిపిస్తారు. అమ్మాయి అమాయకంగా బొట్టు, పూలు(Flowers) పెట్టుకుంటే మంచిది అంటారు.

నచ్చకుంటే ఎన్నో మాటలు అని బాధపెడతారు. భూమి మీద ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా .. పచ్చిగా మాట్లాడితే ప్రతి ఒక్కరు మానసికంగా వ్యభిచారులే(Mentally adulterous). ఎవరి ఆలోచనలు గొప్పగా లేవు ఎవరి చర్యలు ఉత్తమంగా లేవు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగే యవ్వారమే, ఎవరికి వారు ఆడ, మగ ఇతర జాతీయులు కలిపి ప్రతి ఒకరు కనీసం ఒక్కరోజైనా మానసిక వ్యభిచారం చేసినవాళ్లే. శరీరం ఏముంది తప్పు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు తప్పు తెలుసుకున్న స్వామి అంటే.. కానీ మానసికంగా ఆలోచన పరంగా చేసే తప్పుకి భగవంతుడు క్షమాభిక్ష పెట్టడు. తప్పులెన్నువాడు తమ తప్పులెరుగడు, అందరూ సర్వమంగళ మేళాలే.

ఎవరికి వారు కనీసం తెలిసి తప్పు చేయకూడదు, తెలిసి మోసం చేయకూడదు , తెలిసి ద్రోహం చేయకూడదు, మొహాలు, తాపాలు, ఆకర్షణలు సహజం. తప్పు అని తెలిసాక తెలుసుకుని మంచిగా బతుకే వాడికి మోక్షం పుణ్యం వస్తుంది. పాపం పనులు పాపపు మాటలు మీతో పాటు మీ వంశాన్ని నాశనం చేస్తుంది. కర్మ ఎవరిని వదలదు మీ మాటలు కూడా లెక్కించబడతాయి. ఆలోచన కూడా పాపం లిస్ట్ లో ఉంటుంది . అయినా మేం పాపమే చేస్తాం అంటే చేయండి. మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత నాశనం అవుతారు నాకు అదే కావాలి , తథాస్తు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన వారంతా మాధవీలత(Madhavilatha)కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story