- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా నా కోరిక తీరలేదు: అవికా గోర్
ఒక నటిగా నాకు పూర్తిగా ఆత్మసంతృప్తిని కలిగించే ఒక డ్రీమ్ రోల్‌ను మాత్రం ఇప్పటివరకు చేయలేకపోయాను.

దిశ, సినిమా: ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలోనే విడుదల కాబోతున్న ‘అగ్లీ స్టోరీ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అవికా గోర్ తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో తన ప్రయాణం గురించి అవికా మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేశాను. కానీ ఒక నటిగా నాకు పూర్తిగా ఆత్మసంతృప్తిని కలిగించే ఒక డ్రీమ్ రోల్‌ను మాత్రం ఇప్పటివరకు చేయలేకపోవడంతో నా కోరిక తిరలేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా నా మనసుకు నచ్చిన, ఛాలెంజింగ్‌గా ఉండే ఆ ఒక్క పాత్ర కోసం నేను ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను. నా లైఫ్‌లో అదొక చిన్న బాధగా మిగిలిపోయింది" అంటూ తన ఆవేదనను పంచుకుంది. ఇక తన వ్యక్తిగత జీవితం, పెళ్లి గురించి అవికా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.
"నేను మిలింద్ దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నాం. ఆ తర్వాత మా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అయితే మొదట్లో మా పేరెంట్స్ ఈ పెళ్లి విషయంలో కొంచెం సందేహపడ్డారు. కానీ ఆ తర్వాత మా ప్రేమను, మమ్మల్ని అర్థం చేసుకుని సంతోషంగా మా పెళ్లికి ఒప్పుకున్నారు" అని అవికా చెప్పింది. పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉందనే విషయంపై స్పందిస్తూ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాక తన జీవితం చాలా సంతోషంగా సాగుతోందని, ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. తామిద్దరం ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నామని పేర్కొంది. అలాగే పెళ్లి తర్వాత తన జీవితంలో కొన్ని మార్పులు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఆ మార్పులన్నీ చాలా పాజిటివ్‌గా ఉన్నాయని అవికా గోర్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






