- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకుని మరీ లాక్కొచ్చి పడేస్తా’.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్‌లో ‘తండేల్’(Thandel) అనే సినిమా చేస్తున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్‌లో ‘తండేల్’(Thandel) అనే సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. అయితే ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో పాటు వరుస అప్‌డేట్ ఇస్తూ మూవీపై మరింత హైప్ పెంచుతున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచేశారు. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా తండేల్ మూవీ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా దానికి ‘ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకుని మరీ లాక్కొచ్చి పడేస్తా’ అంటూ కండలు ఉన్న ఎమోజీతో పాటు లవ్ సింబల్ ఎమోజీని జోడించింది.
ఇక ఈ పోస్టర్‌ను గమనించినట్లయితే.. తండేల్ మూవీ థియేటర్లలో రావడానికి 9 రోజులు ఉన్నాయని సింబాలిక్‌గా సముద్ర అలలతో 9 అని డిజైన్ చేసి ఉంది. అలాగే ఈ సముద్రంలో హీరో.. హీరోయిన్‌ను ఎత్తుకున్నాడు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. కాగా ఇప్పటి వరకు సరైన హిట్‌ను కైవసం చేసుకోలేకపోయిన చైతన్యకు ఈ సినిమా అయినా మంచి విజయం సాధించాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూరుకుంటున్నారు. మరి ఈ చిత్రం ఆడియన్స్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు వెయిట్ చేయాల్సిందే.






