- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యుఫోరియా’ : డ్రగ్స్ మహమ్మారితో యువత జీవితాలు సర్వనాశనం
ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ ‘యుఫోరియా’ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది. భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ద్వారా.. నేటి యూత్ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎలా పెడదారి పడుతున్నారనే విషయాన్ని చూపించబోతున్నారు.

దిశ, సినిమా : ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ ‘యుఫోరియా’ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది. భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ద్వారా.. నేటి యూత్ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎలా పెడదారి పడుతున్నారనే విషయాన్ని చూపించబోతున్నారు. తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలనే అంశాన్ని భూమిక పాత్ర ద్వారా చర్చించబోతున్నారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముందుగా క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించినా.. బాక్సాఫీస్ క్లాష్ పెరగడంతో ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
20 ఏళ్ల క్రితం గుణ శేఖర్, భూమిక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీలో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. యుఫోరియా కోసం మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో చేతులు కలిపింది. భూమికను దృష్టిలో ఉంచుకుని గుణశేఖర్ ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటూనే చక్కటి మెసేజ్ కూడా యుఫోరియా సినిమాలో ఉంటుంది. కాల భైరవ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు






