- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Erica Fernandez: శారీరకంగా చాలా వేధించే వాడు.. బ్రేకప్‌పై ఇన్నాళ్లకు మౌనం వీడిన యంగ్ హీరోయిన్
టెలివిజన్ (Television), సినిమా వంటి రంగాల్లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకుంది తమిళ (Tamil) బ్యూటీ ఎరికా ఫెర్నాండెజ్

దిశ, సినిమా: టెలివిజన్ (Television), సినిమా వంటి రంగాల్లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకుంది తమిళ (Tamil) బ్యూటీ ఎరికా ఫెర్నాండెజ్ (Erica Fernandez). ‘ఐన్తు ఐన్తు ఐన్తు’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. తమిళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు మూవీ తీసి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే.. ఆది సాయికుమార్ (Adi Saikumar) నటించిన ‘గాలిపటం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే.. గత కొన్నేళ్లు ఎరికా ఎటువంటి సినిమాలు చెయ్యకపోవడంతో.. ఆమె మళ్లీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎరికా ఫెర్నాండెజ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రజెంట్ నెట్టింట హాట్ టాపిక్(Hot topic)గా మారింది. అందులో తన వైలెంట్ రిలేషన్‌షిప్(Violent relationship)పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘నేను చాలా కాలం ఒంటరిగా ఉన్నాను.. ఆ సమంలో ముందుకు వెళ్లలేకపోయాను. నా జీవితంలో వచ్చిన కష్టాలు, హెచ్చు తగ్గులు, గాయం, నమ్మక సమస్యలు ఇలాంటివి ఎన్నో చూశాను. అవన్నీ అనుభవాలుగా నన్ను ఇలా తీర్చిదిద్దాయి’ అని తెలిపింది. అలాగే తన బ్రేకప్(Breakup)పై మాట్లాడుతూ.. ‘నేను చాలా హింసాత్మక సంబంధాన్ని అనుభవించాను. శారీరకంగా చాలా వేధింపులు కూడా ఎదుర్కున్నాను. కానీ ఆ సమయంలో నేను దాని గురించి చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే.. ఒక నటిగా ఉన్నప్పుడు ప్రతిదీ వార్తగా మారుతుంది. పోలీసుల వద్దకు వెళితే అది మీడియాలో వస్తుంది. ఆపై మీడియా విచారణ. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుంది అనుకుంటారు అనే భయం. అంతేకాకుండా, నేను పోలీసుల వద్దకు వెళితే ఫలితం ఎలా ఉంటుందో నాకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే నేను న్యాయ వ్యవస్థను అంతగా నమ్మను. అందుకే ఈ వేధింపుల విషయంలో చాలా కాలం మౌనంగా ఉండిపోయాను. నేనే కాదు.. మహిళలు చాలా మంది అందుకే బయటకు మాట్లాడరు. వారినే లక్ష్యంగా చేసుకుని చిత్ర, విచిత్రంగా ప్రశ్నిస్తారు. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే.. మనం ఏ విషయం గురించైనా మాట్లాడానికి సిద్ధంగా ఉంటడానికి ముందు.. ఆ విషయాన్ని వ్యక్తిగతంగా ఎదుర్కోవడానికి సమయం పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
READ MORE ...
‘సారీ మై లవ్స్ ఆలస్యంగా విష్ చేస్తున్నందుకు’: రష్మిక మందన్న






