- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి రావడం అంత తేలిక కాదు.. ఆ ప్రయాణం నాకెంతో ఉపయోగపడింది: ధృవ్ విక్రమ్
ఒక స్టార్ కిడ్‌గా సినిమా ఇండస్ట్రీలోకి రావడం వెనుక ఎన్నో అంచనాలు, విమర్శలు ఉంటాయని, వాటిని తట్టుకొని హీరోగా నిలవడం అంత తేలిక కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయాడు. ఇక గత ఏడాది వచ్చిన ‘బైసన్’ కూడా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ధృవ్ విక్రమ్ కథలు వింటున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ధృవ్ విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తన నటనను మెరుగుపరుచుకోవడానికి పడిన కష్టాలను పంచుకున్నారు. నటన నేర్చుకోవడం కోసం ఆయన తండ్రి విక్రమ్ ఆయన్ని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్'కు పంపించారట. ధృవ్ విక్రమ్ జీవితంలో ఆ ప్రయాణం ఒక నటుడిగా మారడానికి, తన సొంత గుర్తింపును వెతుక్కోవడానికి మొదటి అడుగుగా నిలిచిందని అన్నారు.
ఈ విషయాల గురించి ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు నటనపై ఆసక్తి ఉందని, నటుడిగా మారాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఇక్కడి వాళ్లు దాన్ని అంత సులభంగా అంగీకరించలేదని గుర్తుచేసుకున్నారు. ఒక స్టార్ కిడ్‌గా సినిమా ఇండస్ట్రీలోకి రావడం వెనుక ఎన్నో అంచనాలు, విమర్శలు ఉంటాయని, వాటిని తట్టుకొని హీరోగా నిలవడం అంత తేలిక కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ఎప్పుడైతే తాను నటన నేర్చుకోవడానికి న్యూయార్క్ వెళ్లానో, అక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిపారు. న్యూయార్క్‌లో తన తండ్రి ఎవరు, ఆయన ఎంత పెద్ద స్టార్ అనే విషయాలు ఎవరికీ తెలియదని, అసలు అక్కడ ఎవరూ ఆ విషయాలను పట్టించుకోలేదని ధృవ్ అన్నారు. అక్కడ తాను కేవలం ఒక సాధారణ వ్యక్తిగా, నటనపై ఎంతో ఆసక్తి, పిచ్చి ఉన్న వందలాది మంది తోటి విద్యార్థులలో ఒక్కడిగా మాత్రమే ఉన్నానని చెప్పారు. తన తండ్రి ఇమేజ్‌తో సంబంధం లేకుండా, ఒక నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ఆ న్యూయార్క్ ప్రయాణం ఎంతో ఉపయోగపడిందని ధృవ్ విక్రమ్ వెల్లడించారు.






