- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నో వసంతాలు.. యుఫోరియా సాంగ్ లాంచ్
భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు.

దిశ, సినిమా : భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు వైజాగ్‌లో సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐపీఎస్ శంఖ బ్రాతా భక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..
దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ .. ‘వైజాగ్ కాలేజీలో చదివాను. ఇక్కడి వీధుల్లో తిరిగాను. ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ఇలా ఇప్పుడు మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ‘యుఫోరియా’ అంటే పట్టలేని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహం. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే యుఫోరిక్ మూమెంట్ ఉంటుంది. అలాంటి మూమెంట్‌లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలా మనం కంట్రోల్ చేసుకోలేక అదుపు తప్పితే జీవితం నాశనం అవుతుంది. యుఫోరియా ఎంత సరదాగా ఉంటుందో.. ఆ సరదా తీర్చేలా చిత్రం ఉంటుంది. ఇది కేవలం యూత్ సినిమానే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉంటుంది. పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా చెడిపోతారో చూపించాం. పిల్లలు పెడదారి పడితే సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ మూడు అంశాల చుట్టూనే ఈ ‘యుఫోరియా’ మూవీని తీశాం. అన్ని తరాలకు చెప్పాల్సిన కథ అని నా పిల్లలు, ఫ్యామిలీ ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించారు. అలా అని ఈ సినిమా ఏ మాత్రం ఉపన్యాసం ఇచ్చినట్టుగా కూడా ఉండదు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’లా ఆద్యంతం అలరించే కమర్షియల్ చిత్రంగా ‘యుఫోరియా’ ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూనే ఓ మెసెజ్ ఇచ్చేలా సినిమాని రూపొందించాం. వైజాగ్ వాళ్లకి మెలోడీ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ‘ఎన్నో వసంతాలు’ అనే పాటను ఇక్కడ రిలీజ్ చేశాం. ఈ పాటకు కిట్టు మంచి సాహిత్యాన్ని, కాళ భైరవ మంచి బాణీని అందించారు. ఈ మూవీ కోసం చాలా వరకు కొత్త వారినే తీసుకు వచ్చాను. విఘ్నేశ్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల, లిఖిత యలమంచలి ఇలా అందరి గురించి ఆడియెన్స్ కచ్చితంగా మాట్లాడతారు. ‘ధురంధర్’తో విజయం సాధించిన సారా అర్జున్ ఇందులో చైత్ర అనే పాత్రను పోషించారు. మాకు ఇక్కడ ఈవెంట్‌ను నిర్వహించేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పదేళ్ల క్రితం నేను తీసిన ‘రుద్రమదేవి’కి గంటా శ్రీనివాసరావు సాయం చేశారు. ఇక ఇప్పుడు కూడా ఇలా ఆయన వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు ఇలా అందరితోనూ భూమిక నటించారు. అందుకే అందరి అభిమానులు మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వయసుకు మించి ఓ తల్లి పాత్రను పోషించడం అంటే మామూలు విషయం కాదు. కథ విన్న వెంటనే ఒప్పుకున్న భూమిక గారికి థాంక్స్’ అని అన్నారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘విశాఖ జిల్లా నుంచి వెళ్లి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్న వ్యక్తి గుణ శేఖర్. అలాంటి వ్యక్తి తీసిన ‘యుఫోరియా’ నుంచి ‘ఎన్నో వసంతాలు’ అనే పాటను ఇక్కడ లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. ‘బాల రామాయణం’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తీసి జాతీయ అవార్డుని సాధించారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప సినిమాల్ని రూపొందించారు. ‘యుఫోరియా’ అనే సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు అవసరం అన్నట్టుగా కనిపిస్తోంది. యూత్‌ను సరైన మార్గంలో పెట్టే ఇలాంటి చిత్రాలు కమర్షియల్‌గా హిట్ అవ్వాలి. మంచి మెసెజ్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.






