- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దీవాన’ నుంచి ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ రిలీజ్..
హర్షిత్ రెడ్డి నటిస్తున్న ‘దీవాన’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది.

దిశ, సినిమా: వన్ సైడ్ లవ్ స్టోరీలో ఉన్న మ్యాడ్ నెస్‌ను ప్రేక్షకులకు సరికొత్తగా చూపించేందుకు రాబోతున్న చిత్రం ‘దీవాన’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీ స్టార్ట్ కాగా.. నెట్టింట సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...'ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి, సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం. ఈ పాటకు ‘ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది. ఈ పాట ఎలా ఉందంటే.. ‘తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది.. తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది., మెత్తమెత్త బుగ్గలు, పందిపిల్ల పెదవులు, గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది’ అంటూ ఫన్నీగా ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. పాటలోని కాన్సెప్ట్‌లకు యాప్ట్ అయ్యేలా డిజైన్ చేసిన కొరియోగ్రఫీ, డిఫరెంట్ లొకేషన్స్‌లో చేసిన పిక్చరైజేషన్ ఈ సాంగ్‌కు హైలైట్‌గా నిలుస్తున్నాయి. కాగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్, టీజర్ మంచి రెస్పాన్స్ రాగా.. యూత్ ఆడియెన్స్‌లో ‘దీవాన’ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నది. హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది.






