Satyadev: జీబ్రా సినిమాకు ఎండ్ కార్డ్.. నాకు ఇదొక ప్రపంచం లాంటిదంటూ సత్యదేవ్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

యంగ్ హీరో సత్యదేవ్(Satyadev), డాలీ ధనుంజయ్(Dolly Dhanunjay) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘జీబ్రా’(Zebra).

Satyadev: జీబ్రా సినిమాకు ఎండ్ కార్డ్.. నాకు ఇదొక ప్రపంచం లాంటిదంటూ సత్యదేవ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సత్యదేవ్(Satyadev), డాలీ ధనుంజయ్(Dolly Dhanunjay) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘జీబ్రా’(Zebra). ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటించగా.. కమెడీయన్ సత్య కీలక పాత్రలో కనిపించాడు. అయితే ‘జీబ్రా’ చిత్రం నవంబర్ 22న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మంచి వసూళ్లను కూడా రాబట్టి సక్సెస్‌ ఫుల్‌గా థియేటర్స్‌లోని ప్రేక్షకులను మైమరపించింది.

సాలిడ్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ‘జీబ్రా’ నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ రన్‌కి చేరుకుంది. దీంతో సత్యదేవ్ థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకులతో ముచ్చటించారు. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఎమోషనల్ ట్వీట్(Emotional tweet) చేశారు. ‘‘ఫైనల్లీ ఎండ్ కార్డ్ పడింది. ‘జీబ్రా’ కోసం షరతులు లేని ప్రేమ, మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు(Thank you). గత రెండు వారాల నుంచి నాలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని నమ్మి వచ్చి చూసినందుకు మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మొదటి థియేట్రికల్ హిట్‌(Theatrical hit)ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. నాకు ఇదొక ప్రపంచం లాంటిది. ఇది ప్రారంభం మాత్రమే నేను బలంగా తిరిగి వస్తానని, నా ఉత్తమమైన దాన్ని అందించడం కొనసాగిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కలిసి మరెన్నో మైలురాళ్లు ఇక్కడ ఉన్నాయి!’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా థియేటర్స్‌లో అభిమానులతో ముచ్చటించిన వీడియోను షేర్ చేశారు.

Next Story