యాక్షన్ పాత్రల్లో భావోద్వేగాన్ని శరీరం ద్వారా వ్యక్తపరచాలి.. యంగ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ(Tripthi Dimri) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

యాక్షన్ పాత్రల్లో భావోద్వేగాన్ని శరీరం ద్వారా వ్యక్తపరచాలి.. యంగ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ(Tripthi Dimri) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi) హీరోగా నటిస్తున్న ‘ధడక్-2’(Dhadak2) చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతుండ‌గా.. ధర్మ ప్రొడక్షన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగ‌ష్టు 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లలో భాగంగా త్రిప్తి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది అక్కడ ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ‘యాక్షన్ పాత్రల్లో భావోద్వేగాన్ని శరీరం ద్వారా వ్యక్తపరచాలి. అలాంటి పాత్రలు చేసే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే నాకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని ఉంది. ఇప్పటివరకు అవి విలన్లుగా పరిగణించేవారు కానీ ఇప్పుడు అవి నటన పరంగా ఓ పెద్ద చాలెంజ్‌గా మారాయి’ అని చెప్పింది. ఇక ధడక్-2 గురించి మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో కాలేజీ విద్యార్థినిగా నటించాను. తరగతి గదిలో షూటింగ్ చేసినప్పుడు నా కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చాయి. నా కో యాక్టర్ సిద్ధాంత్ చతుర్వేదితో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడినందు వల్ల షూటింగ్ చాలా ఫన్నీగా సాగింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story