‘పతంగ్’ నుంచి ‘ఎమోషనల్ డ్రామా’ సాంగ్

by Sujitha Rachapalli |

టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న చిత్రం ‘పతంగ్’ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప‌తంగుల పోటీతో

‘పతంగ్’ నుంచి ‘ఎమోషనల్ డ్రామా’ సాంగ్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న చిత్రం ‘పతంగ్’ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామాను సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు నిర్మించగా..విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, వంశీ పూజిత్ ముఖ్య తారాగణం కాగా సింగర్ ఎస్పీ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని ఎమోషనల్ డ్రామాను రిలీజ్ చేసిన సురేష్ బాబు.. ‘కొత్త తరం అంతా కలిసి చేసిన సినిమా రిచ్‌గా ఉది. నాని బండ్రెడ్డి మంచి క్రియేటివిటి ఉన్న పర్సన్‌. కెమెరా వర్క్‌ బాగుంది. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి క్లైమాక్స్‌ను షూట్‌ చేశారు. ఓ స్టేడియంను తీసుకుని, పతంగుల పోటీ పెట్టి ఎంతో భారీగా ఆ పతాక సన్నివేశాలు తీశారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

Next Story