- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్‌లో ఎన్నికల లొల్లి.. నిర్మాత ప్రసన్న కుమార్ కీలక వ్యాఖ్యలు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎన్నికల వేడి రాజుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలకు థియేటర్లు కేటాయించడం, బెనిఫిట్ షోలు ఇవ్వడం వంటి సమస్యలపై చిన్న నిర్మాతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉందని అన్నారు. చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వడం లేదన.. బెనిఫిట్ షోలు కూడా చిన్న సినిమాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే, తమ సమస్యలు పరిష్కరిస్తే ఎన్నికల నుంచి విత్‌డ్రా చేసుకుంటామని ప్రసన్న కుమార్ సవాల్ విసిరారు. పెద్ద నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లడం దారుణమని, చిన్న నిర్మాతలు సొంత డబ్బుతో నామినేషన్లు వేశామని తెలిపారు. కసారి అవకాశం ఇచ్చినా ఏం చేయలేదని.. చివరకు మెడిక్లెయిమ్ చేయిస్తామని చెప్పి అది కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. కాగా, చిన్న నిర్మాతలు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఇండస్ట్రీలో సమాన అవకాశాలు కోసం పోరాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో చిన్న నిర్మాతలు గెలిస్తే థియేటర్ల కేటాయింపు, బెనిఫిట్ షోలు వంటి విషయాల్లో మార్పు రావచ్చని భావిస్తున్నారు. ఈ తాజా పరిణామాలు ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.






