Eesha Rebba: ఇది సినిమాగా రిలీజ్ చేయాల్సిన కంటెంట్.. త్రీ రోజెస్ సిరీస్‌పై ఈషా రెబ్బా కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-11-22 10:32:28  IST  )

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’.

Eesha Rebba: ఇది సినిమాగా రిలీజ్ చేయాల్సిన కంటెంట్.. త్రీ రోజెస్ సిరీస్‌పై ఈషా రెబ్బా కామెంట్స్
X

దిశ, సినిమా: ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి.. సూపర్ హిట్ అందుకున్న ఈ సిరీస్‌లో సీజన్ 2 డిసెంబర్ 12వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా తాజాగా సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ.. ‘‘త్రీ రోజెస్’ సీజన్ 1 కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్ ఈ సీజన్ 2లో ఉంటుంది. సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. సీజన్ 2 స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. షూటింగ్ చేస్తున్నప్పుడు మేమంతా ఆ ఫన్‌ను ఫీల్ అయ్యాం.

నేను, హర్ష ఒక రివేంజ్ మోడ్‌లో క్యారెక్టర్స్ చేశాం. ఈ సీజన్ 2 లో చాలా వైరల్ కంటెంట్ ఉంది. మా డైరెక్టర్ కిరణ్ కొత్త దర్శకుడిలా అనిపించలేదు. కాన్ఫిడెంట్‌గా సిరీస్ చేశాడు. "త్రీ రోజెస్" సీజన్ 2 ను సినిమాగా రిలీజ్ చేయొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది. ఈ సీజన్‌లో రాశీ, సత్య చేసిన క్యారెక్టర్స్ ఫేమ్ అవుతాయి. వాళ్ల కాంబినేషన్ సీన్స్‌లోని డైలాగ్స్ వైరల్‌గా మారుతాయి. కుషిత క్యూట్‌గా, హాట్‌గా కనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ తనకు ఫ్యాన్స్ అవుతారు. ఈ సిరీస్ తర్వాత కుషిత స్టార్ అవుతుంది. ఎస్ కేఎన్ తన ప్రొడక్షన్‌లో కల్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ తోనూ సక్సెస్ అందుకోబోతున్నారు’ అని తెలిపింది.

Next Story