భయపెడుతుంది.. హార్ట్ వీక్ ఉంటే ఈ సినిమా చూడొద్దు..

by Sujitha Rachapalli |

‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బన్నీ వాసు, వంశీ నందిపాటి మరో సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్స్‌పై ‘ఈషా’

భయపెడుతుంది.. హార్ట్ వీక్ ఉంటే ఈ సినిమా చూడొద్దు..
X

దిశ, సినిమా : ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బన్నీ వాసు, వంశీ నందిపాటి మరో సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్స్‌పై ‘ఈషా’ చిత్రాన్ని గ్రాండ్‌గా డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌ రాజ్‌, త్రిగుణ్‌ హీరోలుగా నటించిన ఈ మూవీలో హెబ్బాపటేల్‌ కథానాయిక. కాగా హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈషా సినిమా అందరినీ భయపెడుతుందని.. హార్ట్ వీక్‌గా ఉన్నవారు ఈ సినిమాను చూడొద్దని సూచించారు నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శకుడు.. ఈ చిత్ర సమర్పకులు దామోదర ప్రసాద్, నిర్మాతలకు థాంక్స్ చెప్పాడు.

Next Story