‘ఈషా’ వార్నింగ్.. ఖచ్చితంగా భయపెడుతా..

by Sujitha Rachapalli |

అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్

‘ఈషా’ వార్నింగ్.. ఖచ్చితంగా భయపెడుతా..
X

దిశ, సినిమా : అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్.. డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. కాగా ప్రమోషన్స్‌లో భాగంగా భయపెడుతున్న ఈషా వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వార్నింగ్‌ పేరిట ఇలాంటి వీడియోను విడుదల చేయడం ఇదే తొలిసారి. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉందని ట్రైలర్‌ లో భయపెట్టిన ఈ చిత్ర దర్శకుడు ఈ వార్నింగ్‌ వీడియోలో మనుషుల్లాగే కొన్నిస్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయని ఆసక్తికరంగా మార్చాడు. కెమెరామెన్ సంతోష్ లైటింగ్ వాడిన విధానం.. ఆర్ఆర్ ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా చేశాయి.

Next Story