- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈషాతో భయపెట్టే వరకు వదలం
అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఈషా’. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో

దిశ, సినిమా : అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఈషా’. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రాబోతున్న సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా డిసెంబరు 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సక్సెస్ కావడంతో.. ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన కెఎల్ దామోదర్ ప్రసాద్.. ‘‘ఈషా’ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కేవలం హారర్ మాత్రమే కాకుండా థ్రిల్లర్ మూవీ. సినిమా చూసిన అందరూ కచ్చితంగా భయపడతారు. డిసెంబర్ 25 వరకు మేం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంటాం. ఈ మూవీ క్యాస్టింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చివరకు త్రిగుణ్, హెబ్బా, సిరి, అఖిల్‌లను తీసుకున్నాం. ఈ చిత్రంతో అందరికీ విజయం దక్కాలి. అందరికీ మంచి పేరు రావాలి. ఆల్ ది బెస్ట్’ అని తెలిపారు. బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘నాకు, వంశీకి సినిమాలంటే చాలా ప్యాషన్. అందుకే ఈ ‘ఈషా’ బాధ్యతల్ని దాము గారు మాపై పెట్టారు. డిసెంబర్ 12 అన్నప్పుడు ప్రమోషన్స్‌కి టైం లేదు కదా? అని భయపడ్డాను. కానీ ఇప్పుడు మా ‘ఈషా’ని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతోన్నాం. మేం భయపెట్టడం లేట్ అవ్వొచ్చేమో కానీ.. భయపెట్టడం మాత్రం కన్ఫామ్. ‘ఈషా’ పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు. కార్యక్రమానికి వంశీ నందిపాటి, దర్శకుడు శ్రీనివాస్ మన్నె, త్రిగుణ్, హెబ్బా పటేల్ తదితరులు హాజరయ్యారు.
- Tags
- eesha
- eesha movie






