Eesha : ఈశా మూవీ ఫ‌స్ట్ రివ్యూ ఇదే..గుండెలు అదిరిపోయే సీన్లు !

by velandi.Saikiran |

ఈషా ( eesha) కూడా ఉంది. హారర్, థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన

Eesha : ఈశా మూవీ ఫ‌స్ట్ రివ్యూ ఇదే..గుండెలు అదిరిపోయే సీన్లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రిస్మస్ పండుగ నేపథ్యంలో దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఈషా ( eesha) కూడా ఉంది. హారర్, థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, సిరి హనుమంతు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహిస్తున్నారు.

హెచ్ వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ మూవీ వస్తోంది. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కథ చాలా బలంగా ఉన్నట్లు పోస్టులు పెడుతున్నారు. బిజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుందట. అసలు ఎవరు ఊహించని ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. క్లైమాక్స్ మాత్రం షాక్ కావాల్సిందేనట. రన్ టైం ఈ సినిమాకు చాలా ప్లస్ అని చెబుతున్నారు. ఇక సీట్లో కూర్చున్న వాళ్లు కచ్చితంగా భయపడిపోతారని వివరిస్తున్నారు. మరి సినిమా జనాలను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story