- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ వచ్చేసింది
శ్రీ విష్ణు హీరోగా చేసిన మృత్యుంజయ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రం బృందం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. అది తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా శ్రీ విష్ణు ఎదిగారు. అయితే అలాంటి శ్రీ విష్ణు డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మృత్యుంజయ్ అనే సినిమాతో కాబోతున్నారు. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ అందరినీ ఆకట్టు కుంటోంది.
‘మృత్యుంజయ్’ ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ రిలీజ్
శ్రీ విష్ణు హీరోగా చేసిన మృత్యుంజయ్ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ జిందగీ అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ సినిమా బృందానికి రామ్ పోతినేని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ పాటకు అభినవ కవి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఆదిత్య అయ్యంగార్ ఈ పాటను పాడారు. కాలభైరవ ఈ పాటకు కంపోజ్ చేశారు. కాగా శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ సినిమా మార్చి ఆరవ తేదీన రిలీజ్ కానుంది.






