ఓవైపు సినిమాలు.. మరోవైపు చదువు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసిన బ్యూటీలు వీరే..?

by Pulgam srinivas |

చదువుతోపాటు సినిమాల్లో రాణించిన ముద్దుగుమ్మలు వీరే: శ్రీ లీల, సాయి పల్లవి, శివాని రాజశేఖర్ డాక్టర్ చదువును పూర్తి చేయగా, మీనాక్షి చౌదరి డెంటిస్ట్ కోర్సు పూర్తయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కావ్య కళ్యాణ్ రామ్ లాయర్ చదువు పూర్తి చేసింది.

ఓవైపు సినిమాలు.. మరోవైపు చదువు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసిన బ్యూటీలు వీరే..?
X

దిశ, వెబ్ డెస్క్ : చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరిచి, సినిమాల్లో కూడా అదే స్థాయిలో రాణించిన కొంతమంది నటీమణులు ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.





శ్రీ లీల: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, సినిమాల్లో నటిస్తూనే తన డాక్టర్ చదువును పూర్తి చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన ఎంబిబిఎస్ (MBBS) పట్టా పుచ్చుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.





మీనాక్షి చౌదరి: ప్రస్తుతం జెట్ స్పీడుగా కెరీర్ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ, బ్యాచిలర్ ఆఫ్ డెంటిస్ట్ కోర్సును కంప్లీట్ చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది.





సాయి పల్లవి: జార్జియాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా కెరియర్ ఏమాత్రం డౌన్ ఫాల్ అయినా, చక్కగా డాక్టర్ ప్రాక్టీస్ చేసి ఎంతో మందికి వైద్యం చేస్తానని కూడా సాయి పల్లవి గతంలో చెప్పుకొచ్చింది.





శివాని రాజశేఖర్: ఈ బ్యూటీ కూడా ఎంబిబిఎస్ (MBBS) కోర్సును పూర్తి చేసింది.





కావ్య కళ్యాణ్ రామ్: బలగం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ లాయర్ చదువును పూర్తి చేసింది.

Next Story