Mucharla Aruna : నటి ముచర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు

by Muthe.Rajitha |

ప్రముఖ సీనియర్ నటి ముచర్ల అరుణ(Mucharla Aruna) ఇంటిపై ఈడీ(ED) అధికారులు దాడులు చేశారు.

Mucharla Aruna : నటి ముచర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సీనియర్ నటి ముచర్ల అరుణ(Mucharla Aruna) ఇంటిపై ఈడీ(ED) అధికారులు దాడులు చేశారు. ముచ్చర్ల అరుణ ఉంటున్న చెన్నైలోని నీలాంగరైలోని నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అరుణ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త మన్మోహన్ గుప్తాపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులు చేసినట్టు సమాచారం. అయితే ఖచ్చితమైన కారణాలను ఈడీ ప్రకటించలేదు.

నేడు జరిగిన ఈ సోదాల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అరుణ, తెలంగాణలోని కొత్తగూడెం జన్మించి, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని అర్జునుడుపాలెంలో పెరిగి, 1980లో భారతీరాజా దర్శకత్వంలోని తమిళ చిత్రం కల్లుక్కుల్ ఈరం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి.. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడలో 80కి పైగా చిత్రాల్లో నటించింది. 1987లో మన్మోహన్ గుప్తాను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు.

Next Story