- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన ఈడీ విచారణ.. నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ అధికారుల నోటీసుల అందుకున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఇవాళ విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ అధికారుల నోటీసుల అందుకున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు ఆయనను దాదాపు 5 గంటల పాటు సుధీర్ఘంగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు బాధ్యత గల పౌరుడిగా సమాధానాలు చెప్పానని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో ఇప్పటి వరకు ఒక్క నగదు లావాదేవీ కూడా తాను చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తనను అధికారులు ఐదు గంటల పాటు అన్ని విషయాలపై విచారించారని.. మళ్లీ తనను విచారణకు రమ్మని చెప్పలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని.. కష్టపడి సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలని ప్రకాశ్ రాజ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కాగా, ఇదే కేసులో ప్రకాశ్ రాజ్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల అందుకున్న వారిలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వాస్తవానికి దగ్గుబాటి రానా (Daggubati Rana) ఈనెల 23 విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తనకు షూటింగ్ షెడ్యూల్ ఉందని, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని వారికి సమాచారం అందజేశాడు. తనకు మరింత ఇవ్వాలని రానా అధికారులను రిక్వెస్ట్ చేశారు. అందుకు స్పందించిన ఈడీ ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా మరో నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే






