- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ భూకంపం.. ప్రమాదంలో బ్యాంకాక్ పిల్ల ఫ్యామిలీ!
గడిచిన రెండు రోజులుగా.. భూకంపాల వార్తలే మనం చూస్తున్నాం. ఆర్థికంగా బలంగా.. థాయిలాండ్ ( Thailand), మయన్మార్ (

దిశ, వెబ్ డెస్క్ : గడిచిన రెండు రోజులుగా.. భూకంపాల వార్తలే మనం చూస్తున్నాం. ఆర్థికంగా బలంగా.. థాయిలాండ్ ( Thailand), మయన్మార్ ( Myanmar), బ్యాంకాక్ (Bangkok) లాంటి దేశాల్లో భూకంపాలు ( Earthquakes) చోటు చేసుకున్నాయి. రెండు రోజుల కిందట.. ఈ ప్రమాదం జరిగింది. ఈ భూకంపాల కారణంగా కోట్లల్లో ఆర్థిక నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. కొన్నిచోట్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. అయితే ఈ భూకంపాల నేపథ్యంలో... ప్రముఖ తెలుగు యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల (Bangkok Pilla) కుటుంబం ప్రమాదంలో పడింది. బ్యాంకాక్ పిల్లగా పేరుగాంచిన ఏపీకి సంబంధించిన యువతి కుటుంబం... భూకంపం బారిన పడింది.
బ్యాంకాక్ పిల్ల ప్రస్తుతం... బ్యాంకాక్ లోని (Bangkok) ఓ ప్రముఖ ప్రాంతంలో నివాసం ఉంటుంది. అయితే మొన్నటి భూకంప దాటికి... బ్యాంకాక్ పిల్ల కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్... కూడా కుదేలైందని ఓ వీడియో పెట్టింది. ఈ వీడియోలో.. ఆ అపార్ట్మెంట్లో ఉన్న జనాలందరూ పరుగో పరుగు అంటూ... రోడ్లపైకి వచ్చేసారు. బ్యాంకాక్ పిల్ల కుటుంబం కూడా... చక చక అపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చి రోడ్డుపైకి వచ్చి ప్రాణాలు కాపాడుతున్నారు. అయితే ఈ భూకంప సమయంలో.. అక్కడ జరిగిన సన్నివేశాలను బ్యాంకాక్ పిల్ల షూట్ చేసి మరి యూట్యూబ్ లో పెట్టింది. తమ కుటుంబం భూకంపం భారీ నుంచి బయటపడిందని.. అక్కడి పరిస్థితులను వివరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తెలుగు ప్రజలు.. వెంటనే ఇండియాకు రావాలని ఆమెను కోరుతున్నారు.






