- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దువ్వాడ మాధురి.. ‘చీన్ టపాక్ డుం డుం’లో క్రేజీ రోల్!
2024లో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాల సమయంలో, ఆయనకు తోడుగా నిలిచి, ఆయనతో కలిసి ఉంటున్నారు. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన దువ్వాడ మాధురి ఇప్పుడు వెండితెరపై మెరవనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి వార్తల్లో నిలిచిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, క్లాసికల్ డ్యాన్సర్, వ్యాపారవేత్త అయిన మాధురి.. 2024లో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాల సమయంలో, ఆయనకు తోడుగా నిలిచి, ఆయనతో కలిసి ఉంటున్నారు. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన దువ్వాడ మాధురి ఇప్పుడు వెండితెరపై మెరవనున్నారు. ‘చీన్ టపాక్ డుం డుం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న కొత్త తెలుగు చిత్రంలో ఆమె ఒక విభిన్నమైన, సర్‌ప్రైజ్ రోల్‌లో నటించనున్నారు.
పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా..
‘శుభం’ సినిమాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌తో ప్రేక్షకులకు చేరువైన గవిరెడ్డి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన బ్రిగిడా సాగా హీరోయిన్‌గా నటిస్తోంది. వై.ఎన్. లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘విలేజ్ టాకీస్’ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు ఇదే తొలి చిత్రం. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించే పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఘనంగా ప్రారంభోత్సవం..
ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ హీరోయిన్ సమంత క్లాప్ కొట్టగా.. ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ మల్లిడి వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి, రచయిత బీవీఎస్ రవి, గౌతమి కలిసి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆగస్టులో విడుదలకు సన్నాహాలు..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నర్సీపట్నం, హైదరాబాద్ వాటి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందుతున్న ఈ సినిమాలో దువ్వాడ మాధురి పోషిస్తున్న పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో అలరించిన దువ్వాడ మాధురి టాలివుడ్ ఎంట్రీ ఇవ్వడంతో తన పాత్ర ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.






