Dushara Vijayan: ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ధనుష్ చెల్లి..

by Chukka Sudharani |

‘రాయన్’ చిత్రంలో ధనుష్ చెల్లెలు పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది దుషార విజయన్.

Dushara Vijayan: ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ధనుష్ చెల్లి..
X

దిశ, సినిమా: ‘రాయన్’ చిత్రంలో ధనుష్ చెల్లెలు పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది దుషార విజయన్. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. తన నటనతో ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత RB చౌదరి, ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో జతకట్టడం విశేషం.

ఇక ఈ చిత్రంలో నటి దుషార విజయన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (జూలై 14) ఉదయం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. చెన్నైలో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో రానుండగా.. ఇందులో తంబి రామయ్య, అర్జై తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లింక్

Next Story