- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు కోసం నేను సినిమాలు చేయడం లేదు.. అదే నాకు ముఖ్యం అంటూ దుషారా విజయన్ ఆసక్తికర కామెంట్స్
అలాగే తాను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదని.. తనకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉందని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ దుషారా విజయన్ ప్రస్తుతం మకుటం, జిడిఎన్ సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుషారా సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ప్రాధాన్యత, పారితోషికం గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ‘‘నేను నా కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించాను. మోడలింగ్‌లో కేవలం గ్లామర్‌గా కనిపించడమే ముఖ్యం, అక్కడ నటీనటులను ఒక వస్తువులా చూసే ప్రమాదం ఉంది. కానీ సినిమాలో మాత్రం టాలెంట్‌కే మొదటి స్థానం దక్కుతుంది. కొందరు స్టార్ హీరోలు కేవలం పాన్-ఇండియా క్రేజ్ ఉండి, ఒక నిర్దిష్టమైన లుక్ ఉన్న గ్లామరస్ హీరోయిన్లతోనే పని చేయడానికి ఇష్టపడతారు. కానీ నా విషయానికి వస్తే, దర్శకులు నా టాలెంట్‌ను చూసే నన్ను సంప్రదిస్తున్నారు. అందుకే నా కెరీర్ పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను" అని దుషారా తెలిపారు. అలాగే తాను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదని.. తనకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ చిత్రాలు చేయడం మానేసినా తన ఫ్యామిలీ తనను చూసుకోగలదని అన్నారు. కాబట్టి తనకు పారితోషికం కంటే నటన ముఖ్యమని.. డబ్బు అనేది అదనపు బోనస్ మాత్రమే అని తెలిపింది. ప్రస్తుతం తనకు ఇస్తున్న పారితోషికంతో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు దుషారా విజయన్ స్పష్టం చేశారు.






