‘జిడిఎన్’ విడుదల తేదీ ప్రకటించిన దుషారా విజయన్

by Mallepaka Hamsa |

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఇప్పుడు అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. "బ్రిటిష్ వారికి భయం కలిగించాడు... తన దేశస్థులచే మరచిపోయాడు" అంటూ ఇచ్చిన లైన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది.

‘జిడిఎన్’ విడుదల తేదీ ప్రకటించిన దుషారా విజయన్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖుల జీవితాల ఆధారంగా వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హీరో మాధవన్ కూడా అదే బాటలోభారతీయ సైంటిస్ట్, ఇన్వెంటర్ అయిన జిడిఎన్ నాయుడు బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో ‘జిడిఎన్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ పోస్టర్‌ను విడుదల చేస్తూ దుషారా విజయన్ విడుదల తేదిని ప్రకటించింది. విడుదలైన పోస్టర్‌లో.. జి.డి. నాయుడు పాత్రలో నటిస్తున్న మాధవన్ జనాల మధ్య తెల్లటి దుస్తుల్లో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా.. దుషారా, మాధవన్ పక్కనే సాంప్రదాయ చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఇప్పుడు అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. "బ్రిటిష్ వారికి భయం కలిగించాడు... తన దేశస్థులచే మరచిపోయాడు" అంటూ ఇచ్చిన లైన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. భారతదేశానికి చెందిన ఒక గొప్ప మేధావి కథను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేయడానికే ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాధవన్, దుషారాతో పాటు సీనియర్ నటుడు జయరామ్, కామెడీ స్టార్ యోగిబాబు, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో భారీగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Next Story