- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంత’ ఒకటి.

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంత’ ఒకటి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరిమైన నాటకీయ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకరైన సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు.
ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని ఇప్పటికే చిత్ర బృందం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇక కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.






