- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దుల్కర్ సల్మాన్
గాయపడ్డ సింహం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని AAA Cinemasలో నిర్వహించనున్నట్లు, దానికి దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తాజాగా ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రేపు, అంటే ఏప్రిల్ 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని AAA Cinemasలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, పవన్ సాధినేని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతలుగా కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్, విజయ్ కృష్ణ, ఉమేష్ బన్సల్ వ్యవహరించారు. స్వీకర్ అగస్తీ ఈ సినిమాకు సంగీతం అందించాడు.






