Dulquer Salmaan :ఆ సినిమా కోసం నేను కూడా వెయిటింగ్.. దుల్కర్ సల్మాన్ పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

హీరో విష్ణు విశాల్ తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్యన్’.

Dulquer Salmaan :ఆ సినిమా కోసం నేను కూడా వెయిటింగ్.. దుల్కర్ సల్మాన్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హీరో విష్ణు విశాల్ తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్యన్’. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 31న తెలుగు, తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తున్న చిత్ర బృందం తాజాగా ఆర్యన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను న‌టుడు దుల్కర్ స‌ల్మాన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుదల చేస్తూ.. ‘విష్ణు విశాల్ ‘ఆర్యన్’.. నుండి వచ్చిన ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్‌లాగా కనిపిస్తోంది. సినిమా చూసేందుకు నేను కూడా వెయిటింగ్’ అంటూ తెలిపాడు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే డార్క్‌ ఇంటెన్స్‌ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విష్ణు విశాల్‌ ఇందులో శక్తివంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ మూవీలో సెల్వరాఘవన్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శుభ్ర, ఆర్యన్‌ రమేష్‌, విష్ణు విశాల్‌ నిర్మిస్తున్నారు. లింక్


Next Story